ఫరియా అబ్దుల్లాకు డబుల్ ధమాకా ఆఫర్స్!

by Chukka Sudharani |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’.

ఫరియా అబ్దుల్లాకు డబుల్ ధమాకా ఆఫర్స్!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. 2027 డిసెంబర్‌లో థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘కల్కి’ చాలా మంది యాక్టర్స్ చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. వారిలో ఫరియా అబ్దుల్లా ఒకరు. ఇప్పుడు 'కల్కి 2'లో కూడా ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారనే వార్తలు టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో ఆమె ఒక చిన్న గెస్ట్ రోల్‌లో (పీకాక్ పాత్రలో) మెరవగా.. ఆ పాత్రకు దక్కిన ఆదరణ, ప్రభాస్‌తో ఆమెకున్న సాన్నిహిత్యం కారణంగా సీక్వెల్‌లో ఆమె పాత్రకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మరో క్రేజీ విషయం ఏంటంటే.. ఈ అమ్మడు ప్రభాస్ ‘ఫౌజీ’లో కూడా ఆఫర్ సొంతం చేసుకున్నట్లు టాక్. అయితే.. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.

Next Story