- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజల పక్షాన్నే కాంగ్రెస్ పార్టీ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి, వారికి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ అన్నారు.

దిశ, గాంధారి : కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి, వారికి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ అన్నారు. సోమవారం మండలంలోని వివిధ గ్రామాల్లో నూతన పంచాయతీ కార్యాలయాలతో పాటు గాంధారిలో మహిళా సమాఖ్య భవనాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి వారికి ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతోందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దీనిని ప్రజలు దృష్టిలో ఉంచుకొని, అభివృద్ధి చేస్తున్న వారి పక్షాన నిలవాలని సూచించారు. గాంధారిలోని పోచమ్మ రేవు బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.90 కోట్లు మంజూరు చేయించడంతో పాటు పనులు కూడా పూర్తయ్యాయని అన్నారు. ప్రజలు, రైతులు, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






