- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండ్ల స్థలాల పట్టాల కోసం రేపు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, భూదాన భూములులో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కూనంనేని డిమాండ్ చేశారు.

- జూలై 6న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, భూదాన భూములులో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, పేదల ఇండ్ల స్థలాల కూల్చివేతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు, పోరాటాలు చేయాలని నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగానే జూలై 1న అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. వామపక్ష పార్టీలను కలుపుకుని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూలై 6న ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ధర్నా రాష్ట్ర వ్యాపితంగా ఇండ్ల పట్టాలు రావాల్సినవారు, ఇండ్లు కావాల్సిన వారు దరఖాస్తులు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యమం తరహాలో పేదలకు ఇండ్ల స్థలాల కొరకు మరో పోరాటం చేస్తామని సాంబశివరావు తెలిపారు.
సిగాచి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి
పాశ మైలారం సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించి 54 మంది మరణించిన ఘటన ఏడాది పూర్తయితున్నప్పటికీ బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయి పరిహారం అందకపోవడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ హృదయ విదారకమైన ఘటనలో చనిపోయిన కుటుంబాలకు ఒక కోటి రూపాయల పరిహారం యాజమాన్యం నుండి చెల్లించేలా చేస్తామని నాడు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ కుటుంబాలకు చట్టపరంగా వచ్చే పీఎఫ్, ఈఎస్ఐ బీమాల మొత్తాలను కలుపుకొని కూడా ప్రకటించిన కోటి రూపాయలలో సగం కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. నిజానికి యాజమాన్యం తరఫున నుండి ఒక కోటి రూపాయలు డిమాండ్ ఉన్నప్పటికీ ఖాతరు చేయకపోవడం, స్వయంగా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం సిగాచి యాజమాన్య నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతున్నదని సాంబశివరావు విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈఎస్ఐ, పీఎఫ్ లకు అదనంగా కోటి రూపాయలు, ఘటనలో గాయపడిన వారికి తగిన పరిహారం, వైద్య ఖర్చులను యాజమాన్యం నుండి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగు లేబర్ కోడ్ ల అమలకు ముందే జరిగిన ఈ ఘటనల కంపెనీ యాజమాన్యంతో పాటు కార్మిక శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుందని, లేబర్ కోడ్ లు అమల్లోకి వస్తే ఏమాత్రం పట్టించుకోరని, లేబర్ కోడ్ ల విషయంలో పునరాలోచన చేయాలని సాంబశివరావు అన్నారు.






