- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారుల సమగ్ర వికాసానికి అంగన్వాడీ కేంద్రాలే కీలకం: మంత్రి అడ్లూరి
చిన్నారుల శారీరక, మానసిక వికాసంతో పాటు గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన సేవలు అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

దిశ, గొల్లపల్లి: చిన్నారుల శారీరక, మానసిక వికాసంతో పాటు గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన సేవలు అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని గంగాదేవిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని సోమవారం ప్రారంభించి చిన్నారులకు నూతన యూనిఫామ్ ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంతో పాటు ప్రీ-స్కూల్ విద్య ను అందించడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గంగాదేవిపల్లెలో నూతన అంగన్వాడీ భవనం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్, గంగాదేవిపల్లె, రాఘవపట్నం సర్పంచ్ లు కొలగాని జలందర్, కాసారపు భవాని అరవింద్, ఉప సర్పంచ్ లు సాయి, రవి, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.






