ప్రపంచాన్ని ఆకర్షించేలా విశాఖలో సమ్మిట్.. సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-29 15:09:29  IST  )

విశాఖ కేంద్రంగా 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంపై భారీ అంచనాలు వేసుకుంటుంది. కేవలం పెట్టుబడలేకాకుండా ప్రపంచ స్థాయి ఆలోచనలకు వేదిగా ఈ సదస్సును తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది....

ప్రపంచాన్ని ఆకర్షించేలా విశాఖలో సమ్మిట్..  సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ కేంద్రంగా 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌ను ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంపై భారీ అంచనాలు వేసుకుంటుంది. కేవలం పెట్టుబడలేకాకుండా ప్రపంచ స్థాయి ఆలోచనలకు వేదిగా ఈ సదస్సును తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. వ్యాపార ఒప్పందాలు, పెట్టుబడులు మాత్రమే కాదని, భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేలా ఈ సమ్మిట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.

విశాఖ కంటే రాష్ట్రంలో ప్రాంతీయ సదస్సులు

అంతేకాదు ఈ సదస్సు కంటే ముందే విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని చెప్పారు. అంతేకాదు ఈ సమావేశాల్లోనూ ఎంవోయూలు కుదుర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక విశాఖ సదస్సును విజయవంతం చేసేందుకు జులై నుంచి సెప్టెంబర్ వరకూ దేశ, విదేశాల్లో ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లోనూ రోడ్ షోలతో పెట్టుబడిదారులను ఆకర్షించాలని సూచించారు. ఏపీలో ఉన్న పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని ప్రపంచానికి వివరించాలన్నారు.

అమరావతిలోనూ సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌

అలాగే అమరావతిలో సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా భవిష్యత్ నాయకత్వం, పాలన, పరిశ్రమలు, సాంకేతిక వంటి అంశాలపై శిక్షణ, అంతర్జాతీయ భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సును ఘనంగా విజయవంతం చేసి ప్రపంచ ఆర్థిక పటంలో ఏపీకి బలమైన గుర్తింపు తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు.

Next Story