- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయ్యారం పంచాయతీలో నిధుల గోల్‌మాల్ చేశారంటూ వార్డు సభ్యులు డీపీఓకు పిర్యాదు!
పంచాయతీ కార్యదర్శి నిధులు గోల్మాల్ చేశారంటూ బయ్యారం ఏడుగురు వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

దిశ, బయ్యారం: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గత సర్పంచ్ పదవీకాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో పంచాయతీ కార్యదర్శి నిధులు గోల్మాల్ చేశారంటూ బయ్యారం ఏడుగురు వార్డు సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో డీపీఓకు, డిఎల్‌పిఓ స్వరూపలకు ఫిర్యాదు చేసినట్లు వార్డు సభ్యులు కత్తి రమేష్, మధుకర్ రాజ్, కళింగ రెడ్డి, విజయ, జానిమియా తదితర సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శి శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్‌కు లక్షన్నర, పైప్ లైన్ రిపేరుకు మూడు లక్షలు, ట్రాక్టర్ డీజిల్‌కు 88,000 వేలు ఆఫీస్ మెయింటెనెన్స్ లక్ష రూపాయలు, ఆఫీస్ స్టేషనరికి లక్షన్నర మొత్తం ఇతర ఖర్చులకు ఎంబీ రికార్డు లేకుండానే సుమారు గా 6 లక్షలు ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్, బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి గుట్టు చప్పుడు కాకుండా సభ్యులకు తెలియచేయకుండా బిల్లులకు సహకరిస్తూ కాగితాలపై సంతకాలు చేసి కాజేశారని ఆరోపిస్తూ, జిల్లా అధికారులకు వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు.
పంచాయితీలో గత సంవత్సరం కాలంలో...
దీనిపై ఎంపీ ఓ నాగరాజు వివరణ కోరగా గ్రామపంచాయతీ బిల్లుల విషయంపై ఫిర్యాదు నాకు అందలేదని, పిర్యాదు అందిన తరువాత విచారణ చేసి చర్యలు ఉంటాయని తెలిపారు. దీనిపై ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి రాంబాబు వివరణ కోరగా గత పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ వారు పెట్టిన ఖర్చులకు ఎంబి రికార్డు చూపెట్టారని, దీనిపై ప్రస్తుత వార్డు సభ్యులకు, సమాచారం తెలుపకపోవడంతో, పంచాయితీలో గత సంవత్సరం కాలంలో నిధులు అక్రమాలు జరిగినట్లు డీపీఓకి ఫిర్యాదు చేసింది. చేసినట్లు సమాచారం అందిందని తెలిపారు. దీనిపై డిఎల్పిఓ స్వరూప వివరణ కోరగా.. బయ్యారం గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో నిధుల దుర్వినియోగం అయింది అంటూ 6గురు వార్డు సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ చేపట్టి నిధుల దుర్వినియోగం జరిగినట్లయితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.






