- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణది దేశంలో అగ్రస్ధానం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రం బియ్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని, బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

- రెండు సీజన్లలో సుమారు 300 లక్షల మెట్రిక్టన్నులు ఉత్పత్తి
- మిల్లింగ్పరిశ్రమలకు ప్రభుత్వం ఎల్లప్పడు అండగా నిలుస్తోంది
- త్వరలో బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం
- ఫోర్టిఫెడ్బియ్యంలో ఎనిమిది రకాల పోషకాలు
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం బియ్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని, బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఇప్పటికే బియ్యం ఎగుమతి చేస్తోందని, బియ్యం మిల్లింగ్ పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా వారి వ్యాపార అవకాశాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి 300 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా, రాష్ట్ర వార్షిక వినియోగం కేవలం 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని తెలిపారు. మనం ఉత్పత్తి చేసే బియ్యంలో పదోవంతు మాత్రమే వినియోగిస్తున్నామని, దీంతో బియ్యం పరిశ్రమ అభివృద్ధికి ఎగుమతులే తదుపరి పెద్ద అవకాశంగా మారాయి. బియ్యం మిల్లర్లు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక బియ్యం ఎగుమతి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. సోమవారం కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తులను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఈ బియ్యంలో విటమిన్ ఏ, విటమిన్ బీ1 నుంచి బీ 12, ఐరన్, జింక్ వంటి ఎనిమిది ముఖ్యమైన సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఉత్పత్తి కోలం, హెచ్‌ఎంటీ, సోనా మసూరి వంటి ప్రజాదరణ పొందిన బియ్యం రకాలలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బహుళ విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం ఉత్పత్తులలో ఇది తొలి ప్రయత్నాల్లో ఒకటిగా నిలుస్తుందని, సాధారణ బియ్యంలానే రుచి, వండే లక్షణాలు కలిగి ఉండి, కీలక సూక్ష్మపోషకాలను అందిస్తుంది. ఆరోగ్యం మాత్రల్లో కాదు, మన భోజన పాత్రలో ఉండాలి. ప్రజలు ప్రతిరోజూ తినే ఆహారం ద్వారా పోషకాహార లోపాలను తగ్గించే సామర్థ్యం ఈ ఉత్పత్తికి ఉందన్నారు. అనంతరం మిల్లర్స్ ఫర్ న్యూట్రిషన్ ఆసియా ప్రోగ్రామ్ లీడర్ మనోజిత్ ఇంద్రా వివరిస్తూ ప్రజలు ప్రతిరోజూ వినియోగించే ఆహారాల ద్వారా పోషకాహారాన్ని మెరుగుపరచడంలో ఫుడ్ ఫోర్టిఫికేషన్ అత్యంత ప్రభావవంతమైన, విస్తరించగల పరిష్కారం. ఫోర్టిఫికేషన్ నాణ్యతను పెంచడం, పోషకాహార ఆహారాల లభ్యతను విస్తరించడం కోసం పరిశ్రమ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. అదే విధంగా కేసీపీ సీఈఓ శ్రీ వైష్ణవి మాట్లాడుతూ పోషకాహారం సులభంగా, అందుబాటులో ఉండాలి. న్యూట్రి పోషణ ద్వారా కుటుంబాలు తమ ఆహారపు అలవాట్లు, వంట విధానాలు మార్చకుండా రోజువారీ పోషక అవసరాలను తీర్చుకోగలుగుతాయి. ప్రతి ఇంటి భోజన పాత్రలో ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులో ఉండేలా చేయడమే మా లక్ష్యమన్నారు.






