- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్ : జులై 1 నుంచి మారనున్నవి ఇవే!
జులై 1వ తేదీ నుంచి దేశంలో కొన్ని ఆర్థిక రూల్స్ మారబోతున్నాయి. పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, క్రెడిట్ కార్డు యూజర్లు, పాస్ పోర్ట్ అప్లికెంట్లు, ఆధార్ కార్డుదారులపై ఈ కొత్త రూల్స్ నేరుగా ప్రభావం చూపనున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : జులై 1వ తేదీ నుంచి దేశంలో కొన్ని ఆర్థిక రూల్స్ మారబోతున్నాయి. పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, క్రెడిట్ కార్డు యూజర్లు, పాస్ పోర్ట్ అప్లికెంట్లు, ఆధార్ కార్డుదారులపై ఈ కొత్త రూల్స్ నేరుగా ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ కార్డు ప్రయోజనాలు, పాస్ పోర్టు ఫీజుల పెంపుతోపాటు తప్పుడు ఆర్థిక ఉత్పత్తుల అమ్మకాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకువస్తున్న కొత్త నిబంధనలు కూడా వీటిలో ఉన్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ -1, ఐటీఆర్ -2 దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు తమకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను జులై 31, 2026లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితో జరిమానాలు చెల్లించాల్సి రావడమే కాకుండా.. కొన్ని పన్ను విధానాలను కూడా ఎంచుకునే అవకాశం కోల్పోతారు. నిబంధనల ప్రకారం వచ్చే నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వీలుండదని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.
ఆధార్ కార్డుదారులకు ఊరటనిస్తూ జులై 1 నుంచి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీని అప్డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకూ వసూలు చేస్తున్న రూ.75 ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉచిత సదుపాయం జులై 1,2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఆరునెలల పాటు అందుబాటులో ఉంటుంది.
ఇక క్రెడిట్ కార్డు రంగంలో.. SBI ఎంపిక చేసిన ఫోన్ పే SBI క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల ప్రోగ్రామ్ ను జులై 1 నుంచి సవరించనుంది. ఫోన్ పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు పర్పుల్, ఫోన్ పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు సెలెక్ట్ బ్లాక్ కార్డులపై రివార్డు పాయింట్లకై కొత్త పరిమితులు విధించడమే కాకుండా.. కొన్ని లావాదేవీలను రివార్డు పాయింట్ల లిస్టు నుంచి తొలగించారు. మరోవైపు HDFC క్రెడిట్ కార్డు వినియోగదారులు ప్రతి త్రైమాసికంలో మూడు ఉచిత డొమెస్టిక్ ఎయిర్ పోర్టు లాంజ్ విజిట్స్ పొందాలంటే.. అంతకుముందు మూడు నెలల్లో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి.
భారత్, విదేశాల్లో సాధారణ, తత్కాల్ పాస్ పోర్టు ఫీజులను విదేశాంగ మంత్రిత్వశాఖ సవరించిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి పాస్ పోర్టు సేవలు మరింత ప్రియం కానున్నాయి. చివరిగా బ్యాంకులు కస్టమర్లకు తప్పుడు ఆర్థిక ఉత్పత్తుల్ని విక్రయించేందుకు ఆర్బీఐ జులై 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. దీని ప్రకారం బ్యాంక్ సిబ్బంది తప్పుడు సమాచారంతో ప్రొడక్ట్స్ విక్రయిస్తే.. బాధితులైన కస్టమర్లకు పూర్తి రీఫండ్ తో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.






