- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ రద్దు
జగన్నాథపురం వద్ద మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించి, 30న జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

దిశ, చింతకాని : చింతకాని మండలంలోని జగన్నాథపురం వద్ద మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పరిశీలించి, 30న జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. రేపటి రైతు ఆశీర్వాద సభకు బదులుగా త్వరలోనే ఇదే ప్రాంతంలో రైతు భరోసా ఆత్మీయ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, సీపీ సునీల్ దత్, సుడా చైర్మన్ పూవాళ్ల దుర్గాప్రసాద్, వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, నూకల సత్యనారాయణ గౌడ్, సాధు రమేశ్ రెడ్డి, అంబటి వెంకటేశ్వర్లు, కన్నెబోయిన గోపీ యాదవ్, కొప్పుల గోవిందరావు, మడుపల్లి భాస్కర్ గౌడ్, బందెల నాగార్జున, తాళ్లూరి స్వప్న తదితరులు పాల్గొన్నారు.






