- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వీస్ నుంచి సీనియర్ IPS సునీల్ కుమార్ రిలీవ్
by Vemula.Srinu Prasad |
సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సుదీర్ఘ కాలంగా సస్పెన్షన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఆయన్ను తాజాగా సర్వీస్ నుంచి రిలీవ్ చేసింది. జూన్ 30 నాటికి ఆయన వయోపరిమితి పూర్తికానుంది...

X
దిశ, వెబ్ డెస్క్: సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సుదీర్ఘ కాలంగా సస్పెన్షన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఆయన్ను తాజాగా సర్వీస్ నుంచి రిలీవ్ చేసింది. జూన్ 30 నాటికి ఆయన వయోపరిమితి పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆయనను అధికారికంగా విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఆయనను పోలీస్ సర్వీస్ నుంచి రిలీవ్ చేసింది.
ఆరోపణలపై నో మినహాయింపు
మరోవైపు సునీల్ కుమార్‌పై ఉన్న ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. పెండింగ్‌లో ఉన్న వివిధ శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతో పాటు విచారణలు యథావిధిగా కొనసాగించనుంది. అలాగే ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులను కూడా దర్యాప్తు జరపనుంది. దీంతో ఆయన ఎదుర్కొంటున్న క్రిమినల్, అంతర్గత విచారణల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Next Story






