ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Kodari Anjali |

ధర్మారం మండలం నందిమేడారంలో పెద్దమ్మ తల్లి బోనాలు, పట్నాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, ధర్మారం: ధర్మారం మండలం నందిమేడారంలో పెద్దమ్మ తల్లి బోనాలు, పట్నాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైయ్యారు. వేడుకలకు వచ్చిన మంత్రిని మార్కెట్ వైస్ చైర్మెన్ లింగయ్యతో పాటు ముదిరాజ్ కుల సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ఉన్న పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఆ తల్లి దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ.. నిన్న హైదరాబాద్ లో బీజేపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నభి చేసిన వాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణా అసెంబ్లీ వేదికకగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై పూర్తి నివేదికను అందించిన, కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐతో విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపి జాతీయ నాయకత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిని కాపాడేది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీనేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రుప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story