తినే తీరుతో మార్పులు.. భోజన రుగ్మతలపై కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే..?

by Kodari Anjali |

ప్రస్తుత రోజుల్లో చాలా మంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదు.

తినే తీరుతో మార్పులు.. భోజన రుగ్మతలపై కౌన్సిలింగ్ సైకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. తద్వారా అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొంతమంది సమయానికే తింటుంటారు. మరికొంతమంది టైమ్‌తో సంబంధం లేకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటారు. అయితే తినే తీరుతో కూడా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.

అయితే భోజనానికి మనసుకి సంబంధం ఉంటుందని తాజాగా నిపుణులు అంటున్నారు. కోపం, భావోద్వేగాలు, ప్రవర్తనలో మార్పులు, యంగ్జైటీ, వ్యాకులత వంటి ఎన్నో ప్రాబ్లమ్స్ తినే తీరులో చాలా మార్పులు తెచ్చిపెడుతాయని చెబుతున్నారు. కాగా ముఖ్యంగా కౌమార దశలో వచ్చే పిల్లల్లో ఎక్కువగా ఈ భోజన రుగ్మతలపై అవగాహన కోసం నిపుణులు వివరించారు.

అనో రెగ్జియా నర్వోజా అని పిలువబడే దాన్ని ఫ్యాషన్ డిజార్డర్ అని మరో పేరు కూడా ఉంది. దీని ఉద్దేశం ఏంటంటే..? కొంచెం అతిగా తిన్నా కూడా వెయిట్ పెరుగుతామోనని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందక ఆరోగ్యం క్షీణిస్తుంది. అయితే కొంతమంది చాలా ఆహారం తీసుకుంటారు. దీన్నే బులీమియా నర్వోజా అని అంటారు.

శరీరాకృతిపై అవసరమైన దానికంటే అధికంగా తింటారు. దీంతో జీర్ణక్రియ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నాన్ స్టాప్ గా తినేవారు కూడా ఉంటారు. ఈ అలవాటు ఉన్నవారిని బింజ్ ఈటింట్ డిజాస్టర్ అని పిలుస్తారు. తద్వారా వెయిట్ పెరిగి స్థూలకాలం, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.

అలాగే తిన్న తర్వాత కొంతమంది మనం తిన్న ఆహారం సమతుల ఆహారమేనా? అని వారిలో వారే సందేహపడుతారు. దీన్ని ఆర్తో రెగ్జియా అని అంటారు. తరచూ నేను అతిగా తింటున్నానా? లేదా తక్కువగా తింటున్నానా? అని అనుకుంటుంటారు. దీంతో వారిలో వారే కఠిన నియమాలు పెట్టుకుంటారు. పోషక విలువలు కూడా లెక్కలేసుకుని తింటుంటారు. తద్వార హెల్త్ పై ప్రతికూల ప్రభావం చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భోజన రుగ్మతలకు కారణాలు అనేకం ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్య సమస్యలకు దారీ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story