పవన్ ఏం సాధించారు? ఏం సాధించబోతున్నారు?

by Bhoopathi Nagaiah |

పవన్ ఏం సాధించారు? ఏం సాధించబోతున్నారు? అంటు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు.

పవన్ ఏం సాధించారు? ఏం సాధించబోతున్నారు?
X

దిశ, ఏపీబ్యూరో: పవన్ ఏం సాధించారు? ఏం సాధించబోతున్నారు? అంటు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పొత్తుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం సాధించారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌‌తోనే సాధ్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడానికి ప్రధాన కారణం బీజేపీయేనని ఆరోపించారు. ఏం చేయలేక చంద్రబాబు చతికిలపడ్డారని ఎద్దెవ చేశారు. ప్రస్తుత సీఎం ఒక చాన్స్ అని చెప్పి ప్రజలను దోచుకుంటున్నాడని అన్నారు. పవన్ ప్రసంగం విని జనం నవ్వుకుంటున్నారని ఆయన విమర్శించారు.

Next Story