- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండ్ల గణేష్ ‘సంకల్ప యాత్ర’.. నటుడు శివాజీ ఏమన్నారంటే?
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టైన సందర్భంలో వేంకటేశ్వర స్వామి వారికి మొక్కుకున్నానని.. తాజాగా ఈ మొక్కు చెల్లించుకోవడానికి సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో బండ్ల గణేష్ తన ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకునేందుకు ఇవాళ(సోమవారం) ఉదయం 9గంటలకు షాద్ నగర్ నుంచి తిరుమల వరకు ‘సంకల్ప యాత్ర’ ప్రారంభించారు.
అయితే బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పై నటుడు శివాజీ స్పందించారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ.. ఒక సామాన్యుడిగా వచ్చి బ్రాండ్ గా ఎదిగిన గణేష్ సీఎం చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటకు రావాలని కోరుకొని ఈ సాహోసోపేత యాత్ర చేస్తున్నారని కొనియాడారు. 32 ఏళ్ల స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గణేష్ ఎప్పుడు తనను నమ్మిన వారిని వదలుకోరని నటుడు శివాజీ తెలిపారు.
Read More..






