సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేశ్ పాదయాత్ర

by Thanuru Gopichand |   (  Updated:2026-01-18 11:22:17  IST  )

రాజకీయం లేదు అభిమానంతోనే.

సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేశ్ పాదయాత్ర
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (Nara Chandra Babu Naidu) తనకున్న అచంచలమైన అభిమానాన్ని చాటుకుంటూ ఆయన 'సంకల్ప పాదయాత్ర'కు (Sankalpa Padayatra) శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న కష్టకాలంలో ఆయన క్షేమంగా బయటపడి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బండ్ల గణేష్ తిరుమల (Tirumala) వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు భారీ విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో, తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ ఈ పాదయాత్ర చేపట్టారు. సంకల్ప యాత్ర పేరిట సాగనున్న ఈ పాదయాత్ర జనవరి 19వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఆయన స్వగృహం నుండి ప్రారంభం కానుందని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. తన నివాసం నుండి కాలినడకన బయలుదేరి దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నానని తెలిపారు. ఈ యాత్రను భక్తి శ్రద్ధలతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా కేవలం తన అభిమాన నాయకుడి కోసమే ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు బండ్ల గణేష్ స్పష్టం చేశారు. అయితే ఈ పాదయాత్ర ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

READ MORE .....

ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను : సీఎం

Next Story