- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో దశ నోటిఫికేషన్ విడుదల
పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల! ఏప్రిల్ 29న పోలింగ్, మే 6న ముగియనున్న ప్రక్రియ. బెంగాల్ రాజకీయాల్లో పెరుగుతున్న వేడి.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికే మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. అసెంబ్లీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గెజిట్ ప్రకారం, రెండో దశ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలు ఖరారయ్యాయి. ఈ దశలో భాగంగా నిర్దేశిత నియోజకవర్గాల్లో ఏప్రిల్ నెలాఖరులో పోలింగ్ జరగనుంది. ఈ రెండో దశ షెడ్యూల్ ప్రకారం.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 9, ఏప్రిల్ 29న పోలింగ్, మే 6 లోపు మొత్తం ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈసారి బెంగాల్ ఎన్నికలను కేవలం రెండు దశల్లోనే ముగించాలని ఈసీ నిర్ణయించడంతో రాజకీయ పార్టీలు తమ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. మొదటి దశలో 152 స్థానాలకు, రెండో దశలో 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
నోటిఫికేషన్ ప్రధానాంశాలు
రెండో దశలో భాగంగా నోటిఫై చేసిన నియోజకవర్గాల్లో పటిష్ట భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని గెజిట్‌లో ఆదేశించారు. బెంగాల్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ (TMC), సత్తా చాటాలని బీజేపీ మరియు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి వ్యూహాలు రచిస్తుండటంతో ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి.






