సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి మహ్మద్ అజహారుద్దీన్

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-02 07:02:51  IST  )

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహ్మద్ అజహారుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి మహ్మద్ అజహారుద్దీన్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహ్మద్ అజహారుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించిన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తోందని మంత్రి తెలిపారు.

మహిళా సాధికారత, రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి కి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు జంబో చెక్కులు అందజేసి, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజగౌడ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Next Story