వెడ్డింగ్ డ్రామా: పెళ్లి కొడుకును వదిలి ప్రియుడికి జైకొట్టిన వధువు!

by Malleboina Mahesh |

మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో వింత ఘటన! పెళ్లి మండపంలో వరుడికి షాక్ ఇస్తూ, అందరూ చూస్తుండగానే తన ప్రియుడికి వరమాల వేసి హత్తుకున్న వధువు.

వెడ్డింగ్ డ్రామా: పెళ్లి కొడుకును వదిలి ప్రియుడికి జైకొట్టిన వధువు!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఎన్నో వివాహాలు చివరి నిమిషంలో ఆగిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో వైరల్ గా మారీ తీవ్ర చర్చకు దారితీసింది. అందులో పెళ్లి కొడుకును వదిలి ప్రియుడికి వరమాల వేయడం కనిపించింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చింద్వారా జిల్లాలోని ముజావర్ గ్రామంలో ఏప్రిల్ 27- 28 మధ్య రాత్రి చోటుచేసుకుంది. పరాసియా ప్రాంతానికి చెందిన వరుడు తన బంధుమిత్రులతో కలిసి భారీ బారాత్‌తో వివాహ వేదికకు చేరుకున్నాడు. పెళ్లి వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్న క్రమంలో, వధువును 'వరమాల' (దండలు మార్చుకోవడం) రసం కోసం స్టేజ్ మీదకు తీసుకువచ్చారు.

ఆ సమయంలో వరుడు ఆమెకు దండ వేయడానికి సిద్ధంగా ఉండగా, వధువు అనూహ్యంగా స్టేజీ నుండి కిందకు దిగి, అక్కడ నిలబడి ఉన్న తన ప్రియుడికి అందరూ చూస్తుండగానే దండ వేసి అతనిని హత్తుకుంది. వధువు చేసిన ఈ పనితో పెళ్లికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వధువు తరపు బంధువులు, ఆ ప్రియుడిని పట్టుకుని అక్కడే చితకబాదారు. తమకు జరిగిన ఘోర అవమానాన్ని భరించలేకపోయిన వరుడు, వెంటనే వివాహాన్ని రద్దు చేసుకుని తన బారాత్‌తో సహా ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. అనంతరం, వరుడి కుటుంబ సభ్యులు ఉమ్రేత్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. వధువు గత రెండేళ్లుగా ఆ యువకుడితో ప్రేమలో ఉందని, కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే ఈ పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం.

Next Story