మూడు కిలోల వెండితో పెళ్లి పత్రిక

by Muthe.Rajitha |

ఓ వ్యాపారి ఏకంగా పెళ్లి పత్రికనే వెండితో చేయించాడు.

మూడు కిలోల వెండితో పెళ్లి పత్రిక
X

దిశ, వెబ్ డెస్క్ : వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నప్పటికీ ఓ వ్యాపారి ఏకంగా పెళ్లి పత్రికనే వెండితో చేయించాడు. రాజస్థాన్‌కు చెందిన శివ్‌ జోహారీ తన కుమార్తె పెళ్లి కోసం మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో ప్రత్యేకమైన ఆహ్వాన పత్రికను తయారు చేయించడం వైరల్ గా మారింది. ఈ వెండి పెళ్లి కార్డు మొత్తం 128 విడి భాగాలతో రూపొందించబడింది. ఇందులో ఒక్క మేకు గాని స్క్రూ గాని వాడలేదు. దీనిని తయారు చేయడానికి సుమారు ఏడాది సమయం పట్టిందని, ఖర్చు దాదాపు రూ.25 లక్షల వరకు అయ్యిందని తెలిపారు. ఈ పత్రికలో మొత్తం 65 దేవతా విగ్రహాలను చెక్కారు.

పైభాగంలో గణేశుడి విగ్రహం, ఇరువైపులా శివ–పార్వతులు, కింద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి చిత్రాలు ఉన్నాయి. అలాగే వెంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు మరియు విష్ణువు పది అవతారాలు కూడా ఇందులో ఉన్నాయి. తన కూతురు వివాహానికి బంధువులతో పాటు దేవుళ్లను కూడా ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ వెండి ఆహ్వాన పత్రికను తయారు చేయించానని శివ్‌ జోహారీ మీడియాకు తెలియజేసారు.

Next Story