తెలంగాణలో మారిన వాతావరణం..ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు

by Malleboina Mahesh |

తెలంగాణలో మారిన వాతావరణం. ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. ఎండల నుండి ప్రజలకు ఊరట.

తెలంగాణలో మారిన వాతావరణం..ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎండల వేడి తో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఛత్తీస్‌గఢ్ నుంచి అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి తేమ గాలులు అధికంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని సరిహద్దు జిల్లాల్లో వర్షం తీవ్రత కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అకాల వర్షాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. గాలిలో తేమ పెరగడం వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, గాలివానల సమయంలో విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story