- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఏర్పాటును అవమానించేలా పాకిస్తాన్ తో పోల్చి తప్పుగా మాట్లాడిన తేజస్వి సూర్య వారి పార్టీ విధానాన్ని చెప్పకనే చెప్పారని, నాటి మాటలకు క్షమాపణ చెప్పకుండా నమో జెన్ జీ కాంక్లేవ్ పేరుతో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి, సూర్య హాజరైతే తప్పకుండా అడ్డుకుంటామని ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్ సభలో నాడు తేజస్వీ సూర్య మాటలను ఖండించలేని బీజేపీ, నేతలు ఇప్పుడు ఆయనను తెలంగాణకు ఆహ్వానిస్తున్నారని బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. మీటింగ్ పెట్టాలనుకుంటే ముందు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఇప్పటి వరకు సూర్య మాటలను, బీజేపీ నేతలు కానీ, బీజేపీ నేతలు గానే ఖండించి లేదన్నారు.
తమ అస్తిత్వాన్ని, తమ సెంటిమెంట్‌ను ఎగతాళి చేసి మాట్లాడిన సూర్య తెలంగాణకు వస్తే ఆవేశంతో ఉన్న యువకుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని, తెలంగాణ ప్రజల మనోభావాలను ఎవరు దెబ్బతీసిన ఊరుకునేది లేదని బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. తెలంగాణ అంటేనే భావోద్వేగం, సెంటిమెంట్, అలాంటి అంశాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరి కాదని, దేశంలో పేపర్ లీకులు చేసి, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ, తెలంగాణలో జెన్ జీ యూత్ తో సదస్సులు పట్టడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు. బీజేపీ కుట్రలకు బలవుతున్న జెన్ జీ యువతనే బీజేపీ పాలకుల పై పోరాటం చేస్తోందని, అలాంటి బీజేపీకి ఎలాంటి సమాధానం చెప్పాలో జెన్ జీ యువతకు బాగా తెలుసని బల్మూర్ వెంకట్ చెప్పారు. ఇప్పటికే పోరాటాన్ని ఉధృతం చేశారని, మోడీ ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రజల చేతుల్లో శిక్ష అనుభవించక తప్పదన్నారు.






