- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళిత ఎమ్మెల్యే మందుల సామేల్ జోలికొస్తే సహించేది లేదు
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులను నియమిస్తూ అధికారికంగా ప్రకటించిన తర్వాత పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించడం అత్యంత బాధాకరమని జై భీమ్–జై బాపు–జై సంవిధాన్ జాజిరెడ్డిగూడెం మండల కోఆర్డినేటర్ జీడీ వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పుల రమేష్ పేర్కొన్నారు.

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులను నియమిస్తూ అధికారికంగా ప్రకటించిన తర్వాత పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించడం అత్యంత బాధాకరమని జై భీమ్–జై బాపు–జై సంవిధాన్ జాజిరెడ్డిగూడెం మండల కోఆర్డినేటర్ జీడీ వీరస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వేల్పుల రమేష్ పేర్కొన్నారు. సోమవారం అర్వపల్లిలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ఆధారరహిత ఆరోపణలు చేయడం, అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.
ఎమ్మెల్యేగా సామేల్ ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అలాంటి నాయకత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, తగిన సమయంలో వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. పార్టీలో అభిప్రాయ భేదాలు, సమస్యలు ఉంటే వాటిని పార్టీ అంతర్గత వేదికల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాల్సింది పోయి, బహిరంగ విమర్శలు చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీలో ఉంటూ అదే పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా పార్టీ వ్యతిరేక చర్యలను విరమించి, పార్టీ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొరపిడత అవిలయ్య యాదవ్, కుంకుడుపాల రవీందర్, జీడీ భాస్కర్, ఎడ్ల సైదులు, ఇటికాల చిరంజీవి, నర్సింగ వెంకటేశ్వర్లు, దలవాయి శ్రీధర్, రింగు సత్యం, సాయి, మాదగాని విక్రమ్, కేసాని రాహుల్, శతకోటి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.






