- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఫస్టియర్‌లోనే ప్రాక్టికల్స్
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లోనే ప్రాక్టికల్స్.. 4 సబ్జెక్టులకు 15 మార్కుల చొప్పున కేటాయింపు.. థియరీ పరీక్షలు 60 మార్కులకే!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్ బోర్డు (Inter Board) కీలక అలర్ట్ జారీ చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనే (First Year) ప్రాక్టికల్ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించనున్నట్లు బోర్డు అధికారికంగా సర్క్యులర్ విడుదల చేసింది. నూతన విధానం ప్రకారం సైన్స్ గ్రూపులోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు మొదటి సంవత్సరంలోనే 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులకు గంటన్నర సమయం కేటాయించనున్నారు. మిగిలిన 15 మార్కుల ప్రాక్టికల్స్‌ను యధావిధిగా ద్వితీయ సంవత్సరంలో నిర్వహిస్తారు.
ఈ మార్పుల కారణంగా ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల ప్రధాన థియరీ పరీక్షలను 60 మార్కులకు కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈ నూతన విధివిధానాలను తప్పకుండా అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు (అక్రమాలకు) తావులేకుండా పారదర్శకంగా జరపాలని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది. విద్యార్థులు ఈ మారుతున్న మార్కుల విధానాన్ని గమనించి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది.






