- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో 13 ఏళ్ల బాలిక అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
by Batti.Sumithra |
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

X
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని గాంధారి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన పల్లపు సాయిలు కుమార్తె, 13 ఏళ్ల పల్లపు సంధ్య ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిపారు. ఈ బాలిక కామారెడ్డి బస్టాండ్ నుంచి అదృశ్యమైనట్లు పేర్కొన్నారు. బాలిక ఎత్తు సుమారు 4.8 అడుగులు ఉంటుందని తెలిపారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా వెంటనే 7989690865, 9618261947 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి విజ్ఞప్తి చేశారు.
Next Story






