- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విపత్తు నిర్వహణలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలుపుతాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
విపత్తు నిర్వహణ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: విపత్తు నిర్వహణ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇవాళ సచివాలయంలో ఫైర్ సర్వీసెస్, SDRF, హైడ్రా (HYDRAA) విపత్తు నిర్వహణ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని అన్నారు. విపత్తు నిర్వహణ సిబ్బంది శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. మండల స్థాయి వరకు అత్యాధునిక వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పొంగులేటి అన్నారు.
అదేవిధంగా భారీ బరువులు ఎత్తే డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా హైరైజ్డ్ బిల్డింగ్స్‌లో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు పరికరాలను త్వరలోనే సమకూర్చుతామని అన్నారు. ఫైర్ సర్వీసెస్, SDRF, హైడ్రా విభాగాలు విడివిడిగా కాకుండా, ఒకే గొడుగు కింద సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. హైదరాబాద్ పరిధిలో విపత్తుల నియంత్రణకు హైడ్రా బృందాలను 30 నుంచి 70కి పెంచామని, సిబ్బంది సంఖ్యను కూడా గణనీయంగా పెంచుతున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కేవలం స్పందించడమే కాకుండా, ముందస్తు నివారణ చర్యలు చేపట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.






