- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం
by Batti.Sumithra |
తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు టీపీయుఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.

X
దిశ, కామారెడ్డిటౌన్ : తపస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు టీపీయుఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వారి ప్రధాన డిమాండ్లు 1. 51% ఫిట్మెంట్‌తో పీఆర్సీ రిపోర్ట్ ప్రకటించాలి. పెండింగ్ 6 డీఏలు, బిల్లులు వెంటనే చెల్లించాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి. ఎస్ఎస్ఎ, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. ప్రమోషన్లు, బదిలీలకు ప్రతి ఏటా షెడ్యూల్ విడుదల చేయాలి. 2008 డీఎస్సీ కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భూనేకర్ సంతోష్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర నేతలు రవీంద్రనాథ్ ఆర్య, పుల్గం రాఘవరెడ్డి, మహిళా కార్యదర్శి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Next Story






