- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
60 గజాల బాధితులకు న్యాయం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో గత 19 ఏళ్లుగా ఇందిరమ్మ 60 గజాల ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

దిశ, మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో గత 19 ఏళ్లుగా ఇందిరమ్మ 60 గజాల ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్థులు మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 60 గజాల పట్టాలకు సంబంధించి స్థలాలను గుర్తించి క్షేత్రస్థాయిలో పొజిషన్ చూపించాలని బాధితులు కోరారు. పట్టాలు ఉన్న ప్రతి అర్హుడికి నిబంధనల ప్రకారం స్థలాలు చూపించి ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ముదిగొండ మంజుల రవి యాదవ్, కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నరసింహారెడ్డి, దారెడ్డి వెంకట్ రెడ్డి, ముదిగొండ శ్రీహరి యాదవ్, కోట్ల నరోత్తం రెడ్డి, సుధాకర్ యాదవ్, సలీంఖాన్, జల్లెల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






