వనమహోత్సవం విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కాలే యాదయ్య

by Batti.Sumithra |

వర్షాకాల సన్నద్ధత, సురక్షిత తాగునీటి సరఫరా, ఘనవ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ మన సంరక్షణ, మొక్కల పెంపకం ద్వారా వన మహోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వనమహోత్సవం విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కాలే యాదయ్య
X

దిశ, చేవెళ్ల : వర్షాకాల సన్నద్ధత, సురక్షిత తాగునీటి సరఫరా, ఘనవ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ మన సంరక్షణ, మొక్కల పెంపకం ద్వారా వన మహోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల మున్సిపాలిటీ 12,13, 14,15, 16,17, 18వ వార్డులల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం సందర్భంగా వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాల సన్నద్ధత, సురక్షిత తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ మన సంరక్షణ, మొక్కల పెంపకం ద్వారా వన మహోత్సవం విజయవంతం చేయడం ప్రజల భద్రత వంటి అంశాల పై విస్తృతంగా చర్చించారు. గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాసుల రాము గౌడ్, చేవెళ్ల మాజీ సర్పంచ్ ప్రస్తుత కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాపరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు మధ్యల శ్రీనివాస్, మంగలి కళ్యాణి, అత్తెల్లి మనిషా అనంతరెడ్డి, కృష్ణా నాయక్, దేవల్ గారి గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు పడాల ప్రభాకర్, రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా, మాజీ ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, నాయకులు అత్తెల్లి రవీందర్ రెడ్డి, మల్గారి శ్రీకాంత్ రెడ్డి, కవాడి రాజవర్ధన్ రెడ్డి, పిసరి దామోదర్ రెడ్డి, వార్డు ప్రజలు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Next Story