- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేవెళ్లలో గంజాయి కలకలం
చేవెళ్ల మున్సిపాలిటీ కందవాడ పరిధిలోని స్పిన్‌మ్యాక్స్ టైర్స్ కంపెనీ బారక్‌లో గంజాయి సేవిస్తున్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు.

దిశ, చేవెళ్ల : చేవెళ్ల మున్సిపాలిటీ కందవాడ పరిధిలోని స్పిన్‌మ్యాక్స్ టైర్స్ కంపెనీ బారక్‌లో గంజాయి సేవిస్తున్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 9న మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈగల్ టీమ్ అందించిన విశ్వసనీయ సమాచారంతో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ (ఎన్‌డీడీ) బృందం, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉమాకాంత్ నాయక్ (24) అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని తనిఖీ చేయగా, అతని వద్ద 0.94 గ్రాముల గంజాయి, 3.93 గ్రాముల అనుమానాస్పద మాదక పదార్థం లభ్యమయ్యాయి.
దీంతో పోలీసులు మాదక పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. చేవెళ్లలో వరుసగా గంజాయి సంబంధిత ఘటనల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పట్టుబడుతుండటంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.






