మహిళలపై పెరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి

by Ratna Kumari |

మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు మహిళలంతా సంఘటితంగా ఉద్యమించాలని జాతీయ మహిళా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ పిలుపునిచ్చారు.

మహిళలపై పెరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
X

దిశ, సంస్థాన్ నారాయణపురం : మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు మహిళలంతా సంఘటితంగా ఉద్యమించాలని జాతీయ మహిళా సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బండి జంగమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో నిర్వహించిన జాతీయ మహిళా సమాఖ్య మండల మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళల హక్కుల పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం జాతీయ మహిళా సమాఖ్య ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని వాటి సాధన కోసం పోరాడాలని సూచించారు.

మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి మహిళా సమాఖ్యను మరింత బలోపేతం చేస్తూ మహిళల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మహిళల ఉపాధి, ఆరోగ్యం, విద్య, భద్రత అంశాలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సర్పంచ్ కురిమిద్ద వినోద, గంగపురం లక్ష్మీదేవి, చిలువేరు అరుణ, రాములమ్మ, వనజ, ప్రశాంతి, అనసూయ, కలకొండ పరమేశ్వరి, సువర్ణ, వినోద, కవితతో పాటు పలువురు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story