- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2024 ఫైనల్ ఓటమిని అప్పుడే మర్చిపోయాం.. డి కాక్ సంచలన వ్యాఖ్యలు
"టీమిండియాతో జరగనున్న కీలక పోరుకు ముందు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఫైనల్ ఓటమి గురించి తాము జట్టుగా ఎప్పుడూ చర్చించుకోలేదని, ఆ విషయాన్ని అక్కడితోనే మర్చిపోయామని స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 పోరులో భాగంగా రేపు(ఆదివారం సాయంత్రం) భారత్- సౌతాఫ్రికా (India- South Africa) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో రేపు భారత్‌తో తలపడనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ హై-స్కోరింగ్‌గా ఉండే అవకాశం ఉందని, భారత పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడటం వల్ల తమకు పిచ్ పరిస్థితులపై అవగాహన ఉందని, అయితే భారత ఆటగాళ్లకు ఐపీఎల్ అనుభవం దృష్ట్యా ఇది తమకు పెద్ద అడ్వాంటేజ్ అని అనుకోవడం లేదని డి కాక్ అభిప్రాయపడ్డారు.
గత ఏడాది జరిగిన 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి గురించి స్పందిస్తూ.. ఆ చేదు జ్ఞాపకాన్ని తాము ఎప్పుడో మర్చిపోయామని ఆయన వెల్లడించారు. ఆ మ్యాచ్ తర్వాత జట్టు సభ్యులం ఎవరూ దాని గురించి మాట్లాడుకోవాలని అనుకోలేదని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆ ఒత్తిడి నుండి బయటపడ్డారని తెలిపారు. ప్రస్తుతం తమ జట్టు చాలా నిలకడగా ఉందని, అహ్మదాబాద్ వాతావరణానికి తాము పూర్తిగా అలవాటు పడ్డామని చెప్పారు. రేపటి మ్యాచ్‌లో టీమిండియా కంటే ఎక్కువ పరుగులు చేసి విజయం సాధిస్తామనే ఆశాభావాన్ని క్వింటన్ డి కాక్ వ్యక్తం చేశారు.






