మా బాధ్యత కాకపోయిన కంటోన్మెంట్‌కు చాలా చేశాం: మంత్రి కేటీఆర్

by Web Desk |
మా బాధ్యత కాకపోయిన కంటోన్మెంట్‌కు చాలా చేశాం: మంత్రి కేటీఆర్
X

దిశ,కంటోన్మెంట్: నిజానికి మాకు బాధ్యత లేకపోయినా.. చేయాల్చిన దానికంటే కంటోన్మెంట్‌కు ఏక్కువే చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం రూ. 10 కోట్ల వ్యయంతో కంటోన్మెంట్ పికెట్ నాలా అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కంటోన్మెంట్ బోర్డు సభ్యుల కోరిక మేరకు 20 వేల లీటర్ల త్రాగు నీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి‌కి మా వంతు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. స్కై వే నిర్మాణాలకు ల్యాండ్ ఇవ్వాలని కోరిన ప్రజల అసౌకర్యం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వంద సార్లు విన్నవించినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రహదారుల విస్తరణకు సహకరించాలని కోరిన ముందుకు రాలేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారం ఇంతటితో ఆగదని.. మా ప్రయత్నం కొనసాగిస్తామన్నారు.

కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు కూడా సమర్థవంతంగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర బెవరేజెస్ చైర్మన్ గజ్జెల నగేష్, సీఈఓ అజిత్ రెడ్డి, బోర్డు మాజీ అధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, సాదా కేశవరెడ్డి, మాజీ సభ్యులు పాండు యాదవ్, ప్రభాకర్, నళిని కిరణ్, లోక్ నాథం, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్లు ముప్పిడి గోపాల్, టి.ఎన్.శ్రీనివాస్, సీనియర్ నాయకులు ప్రభు గుప్తా, నివేదిత, నాగినేని సరిత, అందె శ్రీనివాస్, పెద్దోళ్ల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed