- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నాం..!
ప్రజల సమస్యలు తెలియజేయడానికి రాజకీయ నాయకులో..! లేక పెద్దవారో అయి ఉండాల్సిన అవసరం లేదని నిరూపించింది ఓ బాలిక.

దిశ, భైంసా : ప్రజల సమస్యలు తెలియజేయడానికి రాజకీయ నాయకులో..! లేక పెద్దవారో అయి ఉండాల్సిన అవసరం లేదని నిరూపించింది ఓ బాలిక. మా ఏరియాలో రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నామని బైంసాలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అజ్మీర సాంకేత్ కుమార్ కి సోమవారం ప్రజావాణిలో భాగంగా ఓ బాలిక ఫిర్యాదు అందించింది. వివరాల్లోకెళితే పట్టణంలో ఐదవ తరగతి చదువుతున్న శ్రీ దేవిక కుటుంబంతో కలిసి న్యూ సంతోషిమాత కాలనీలో నివాసం ఉంటున్నారు. వర్షాల కారణంగా తన కాలనీలో ఉన్న రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో కాలనీలో నివాసముంటున్న వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని కాలనీ సమస్యలను ఒక లెటర్ పై రాసి ప్రజావాణిలో భాగంగా సబ్ కలెక్టర్ కి అందించింది. దీంతో సబ్ కలెక్టర్ కాలనీ రోడ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యను తమ దృష్టికి తీసుకురావడంతో చిన్నారి శ్రీదేవికని అభినందించారు.






