వేపలమాధారం గ్రామానికి రూ.10 లక్షల చెక్కు, 1.25 లక్షలతో మొబైల్ వాటర్ ట్యాంకర్ అందజేత

by Kodari Anjali |

వేపలమాధారం గ్రామ పంచాయతీకి స్థానిక మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా రూ.10,00,000 విలువైన చెక్కును అందజేసింది.

వేపలమాధారం గ్రామానికి రూ.10 లక్షల చెక్కు, 1.25 లక్షలతో మొబైల్ వాటర్ ట్యాంకర్ అందజేత
X

దిశ, మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని వేపలమాధారం గ్రామ పంచాయతీకి స్థానిక మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా రూ.10,00,000 విలువైన చెక్కును అందజేసింది. అలాగే గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.1,25,000 వ్యయంతో ఏర్పాటు చేసిన మొబైల్ వాటర్ ట్యాంకర్‌ను గ్రామ సర్పంచ్‌కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, జీఎం (P&A) శ్రీరామ్, ఏజీఎంలు వి.ఎస్. సుబ్రమణ్యం, ఎన్. నరేష్, గ్రామ వైస్ సర్పంచ్ ఎం. కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఎస్. బాలరాజు, బి. మోహన్ రెడ్డి, శంభయ్య, గ్రామ వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story