- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఐదు రోజుల పతనానికి బ్రేక్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోవడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు వరుస ఐదు సెషన్ల నష్టాల తర్వాత సోమవారం పుంజుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోవడం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. దీంతో సెన్సెక్స్ 776.01 పాయింట్లు ఎగబాకి 76,835 వద్ద, నిఫ్టీ 228.50 పాయింట్లు లాభపడి 23,995 వద్ద ముగిశాయి. ఈ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 5.10 లక్షల కోట్లు పెరిగి రూ. 480.80 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎటర్నల్ అత్యధికంగా 5.7 శాతం లాభపడగా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో, టీసీఎస్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు రాణించాయి. ప్రధానంగా మార్కెట్ల లాభాలకు బ్రెంట్ క్రూడ్ ధర 9 శాతానికి పైగా తగ్గడమేనని విశ్లేషకులు తెలిపారు. చమురు ధరలు తగ్గితే భారత్‌కు దిగుమతి వ్యయం, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉండటంతో పెట్టుబడిదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపారని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి, రూపాయి బలపడటం కూడా మార్కెట్‌కు కలిసొచ్చాయి.






