- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: కాసేపట్లో ప్రత్యేక పూజలు
by Vemula.Srinu Prasad |
తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో జరుగుతున్నాయి. సోమవారం గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమం జరిగింది. వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో జరుగుతున్నాయి. సోమవారం గ్రంధి పవిత్ర సమర్పణ కార్యక్రమం జరిగింది. వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో కపిలేశ్వరస్వామివారిని మేల్కొలిపారు. అనంతరం పవిత్ర అభిషేకం చేశారు. ఆ తర్వాత నిత్యహోమం, గ్రంధి పవిత్ర సమర్పణ, మూలమూర్తులకు విశేష ఉపచారాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని కృపాకటాక్షాలను పొందారు. అయితే మరికాసేపట్లో యాగశాలలో ప్రత్యేక పూజలు, హోమం, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
Next Story






