హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్

by Taduka Kalyani |

మద్దూరు మండలం జాదవరావుపల్లి గ్రామానికి చెందిన గొయికల శాంతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్ట్
X

దిశ,మద్దూరు: మద్దూరు మండలం జాదవరావుపల్లి గ్రామానికి చెందిన గొయికల శాంతమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బంగారు నగల కోసం పథకం ప్రకారం హత్య చేసిన జోగు రాజు, బడుగుల భాస్కర్‌లతో పాటు దొంగిలించిన బంగారు నగలను కొనుగోలు చేసిన కృష్ణను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం తెలిపారు. నిందితుల నుంచి ఒక తులం బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, రెండు మోటార్ సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన కోస్గి సీఐ సైదులు, మద్దూరు ఎస్ఐ శ్రీనివాసులు తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని, అనుమానాస్పద ఘటనలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ అన్నారు.

Next Story