- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చివరకు రంగనాథ్ బలిపశువైండు.. స్టేట్ బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఫైర్
హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

దిశ. వెబ్‌డెస్క్: ‘హైడ్రా’ కమిషనర్‌గా తక్షణమే తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇదే అంశంపై తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ (Ramachander Rao) రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదల పట్ల ‘హైడ్రా’ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెంపపెట్టు అని కామెంట్ చేశారు. చివరికి ‘హైడ్రా’ కమిషనర్ రంగానాథ్‌ను బలిపశువును చేశారని అన్నారు.
ఈ కేసులో అసలు అపరాథి సీఎం రేవంత్ రెడ్డేనని రామచందర్ రావు ఆరోపించారు. హైడ్రాను పూర్తిగా నిషేధిస్తేనే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని అన్నారు. రేవంత్, ఎంఐఎం కనుసన్నల్లో హైడ్రా నడుస్తోందని ఫైర్ అయ్యారు. హైడ్రా ఇప్పటికీ ఫాతిమా కాలేజీతో పాటు బాడాబాబుల జోలికి వెళ్లకుండా వాళ్లకు కొమ్ముకాస్తోందని ధ్వజమెత్తారు. మొదటి నుంచి పెదల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేసుకుని దమనకాండ చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరచి ‘హైడ్రా’ను రద్దు చేయాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.






