- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటాం: టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి
by Jakkula.Mamatha |
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ముందుంటామని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ అన్నారు.

X
దిశ,హైదరాబాద్ బ్యూరో: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ముందుంటామని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ అన్నారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా సహా అధ్యక్షుడు, పాఠశాల విద్యాశాఖ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్, కార్యదర్శి భాస్కర్‌ల నేతృత్వంలో ప్రతినిధుల బృందం ముజీబ్ హుసేనీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చేందుకు నిరంతరం అందుబాటులో ఉంటున్నామని అన్నారు. పాఠశాల విద్యాశాఖలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగానే అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రుగేష్, ఎం.రవి, శేఖర్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






