కబ్జాలో వరద కాలువలు

by Muthe.Rajitha |

హిమాయత్ సాగర్, గండిపేట చెరువులకు నీరు చేరే వరద కాలువలు, వాగులు కబ్జాలకు గురవుతున్నాయని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కబ్జాలో వరద కాలువలు
X

దిశ, మొయినాబాద్ : మొయినాబాద్ మండలంలో హిమాయత్ సాగర్, గండిపేట చెరువులకు నీరు చేరే వరద కాలువలు, వాగులు కబ్జాలకు గురవుతున్నాయని స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోల్కట్ట గ్రామంలోని సర్వే నెం. 191తో పాటు పలు ప్రాంతాల్లో వరద కాల్వలపై అక్రమ నిర్మాణాలు వెలిసినా రెవెన్యూ అధికారు లు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ నుంచి పక్కా నివేదికలు వెళ్లినా ఆర్ఐలు, సర్వేయర్లు మొద్దునిద్ర నటిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. వరద కాల్వలు, వాగులను రక్షించకపోతే భవిష్యత్తులో చెరువుల ఉనికే ప్రమాదంలో పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూములు అమ్ముకునే పరిస్థితి..

వరద కాల్వల నీటిపై ఆధారపడి వర్షాధార పంట లు సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, కాల్వ లు మాయం కావడంతో బోర్లు వేసుకునే స్థోమత లేని రైతులు చివరికి తమ భూములను అమ్ముకు నే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇప్పటికే స్థానికులు ఇరిగేషన్ అధికారులకు, తహసీ ల్దార్‌ కు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఫీల్డ్ సర్వే నిర్వ హించి నివేదికలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోం ది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో లాలూచీకి స్వస్తి చెప్పి వరద కాల్వలు, వాగు లు, చెక్ డ్యామ్‌లను స్వాధీనం చేసుకుని కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

10 మీటర్ల వాగు.. 2 మీటర్లకు కుదింపు..

తోల్కట్ట గ్రామంలోని సర్వే నెం.137 గుం డా ప్రవహించే 10 మీటర్ల వెడల్పున్న వా గును కబ్జాదారులు కేవలం 2 మీటర్లకు కుదించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీజాపూర్ హైవే సమీపంలో ప్రారంభమయ్యే ఈ వాగు స్వామి రామానంద తీర్థ సోషియో ఎకనామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిధి గుండా ప్రవహిస్తుంది. అయితే, ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కాంపౌండ్ వాల్ నిర్మించి వాగును పక్కకు మళ్లించడంతో ప్రవాహ మార్గం సన్నగిల్లిందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి వాగు మార్గంలో కల్వర్టు నిర్మించి నీటి ప్రవాహాన్ని మరింత అడ్డుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాదాపు కిలోమీటర్ మేర వాగు సహజ ప్రవాహం దెబ్బతిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story