IPL: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం!

by Disha Web Desk 19 |
IPL: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2022ను వరుస ఓటములతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. జట్టులోని కీలక ఆటగాళ్లు తిరిగి ఫామ్‌లోకి రావడంతో వరుసగా రెండు విజయాలు అందుకుంది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో గుజరాత్‌ను చిత్తుచేసింది. గుజరాత్ టైటాన్స్‌పై గెలిచిన ఆనందంలో ఉన్న ఎస్ఆర్‌హెచ్‌కు.. భారీ షాక్ తగిలింది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.

కుడిచేతి బొటనవేలుకు గాయం కావడతంతో.. అతనికి రెండు వారాలు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పినట్లు జట్టు కోచ్ టామ్ మూడీ వెల్లడించారు. దీనితో అతడు రాబోయే కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని కోచ్ మూడీ తెలిపారు. ఇప్పుడిప్పుడే విజయాల బాటి పట్టిన హైదరాబాద్‌కు.. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణించే కీలక ఆటగాడు దూరం కావడం జట్టుకు పెద్దదెబ్బే. సుందర్ త్వరగా కోలుకోవాలని ఎస్ఆర్‌హెచ్ అభిమానులు కోరుకుంటున్నారు.



Next Story