రామ్ అభిమానులకు ఉగాది గిఫ్ట్.. మాస్ లుక్‌తో అదుర్స్

by Dishafeatures2 |
రామ్ అభిమానులకు ఉగాది గిఫ్ట్.. మాస్ లుక్‌తో అదుర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని 'ది వారియర్' మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో అభిమానులకు పక్కా మాస్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. దానికి తగ్గట్టుగానే ప్రతి పోస్టర్‌లో మాస్ ఎలిమెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఉగాది పండుగ సందర్భంగా మూవీ మేకర్స్ అభిమానులకు మాస్ గిఫ్ట్ ఇచ్చారు. ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మూవీ నుంచి సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ పోలీస్ డ్రెస్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ పోస్టర్‌లో లైట్ గడ్డం, సన్ గ్లాసెస్, సీరియస్ లుక్స్‌తో రామ్ ఇంటెన్స్‌గా కనిపిస్తున్నాడు. ఈ మూవీని మేకర్స్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ మరో హిట్‌ అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే జులై 14 వరకు ఆగాల్సిందే.


Next Story