యుద్ధం అప్పుడే ముగుస్తుంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్

by Dishafeatures2 |
యుద్ధం అప్పుడే ముగుస్తుంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ యుద్ధం ముగింపు కోసం ఎదురుచూస్తోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా దీనిని ప్రస్తావించాడు. తన అంచనా ప్రకారం యుద్ధం మే ప్రారంభానికి ముగుస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మే ప్రారంభానికి యుద్ధం అయిపోతుందని, అప్పటికి రష్యా తన వనరులను కోల్పోతుందని, తగిన వనరులు లేక రష్యా వెనుకంజ వేస్తుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జరిగిన చర్చల్లో చాలా తక్కువ మాత్రమే ఫలితాలను ఇచ్చాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు ప్రదేశాలను రష్యా ముట్టడించి ఉంది. మరి జెలెన్‌స్కీ చెప్పనట్లు యుద్ధం మే ప్రారంభానికి ముగుస్తుందో లేదో చూడాలి.



Next Story

Most Viewed