- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నార్సింగి ఇన్‌స్పెక్టర్‌గా విష్ణువర్ధన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
నార్సింగి పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, గండిపేట: నార్సింగి పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించిన హరికృష్ణ రెడ్డి గచ్చిబౌలిలోని పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో విష్ణువర్ధన్ రెడ్డి నియమితులయ్యారు.
శుక్రవారం ఉదయం హరికృష్ణ రెడ్డి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Next Story






