కివీస్‌తో వన్డే పోరుకు సై అంటున్న విరాట్, రోహిత్.. వడోదరలో ముమ్మర సాధన

by Malleboina Mahesh |   (  Updated:2026-01-10 11:17:01  IST  )

భారత స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే మినహా అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కివీస్‌తో వన్డే పోరుకు సై అంటున్న విరాట్, రోహిత్.. వడోదరలో ముమ్మర సాధన
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డే మినహా అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు కేవలం వన్డే మ్యాచుల్లో మాత్రమే ఆడుతుండటంతో.. రేపటి నుంచి న్యూజిలాండ్ తో జరిగే వన్డే మ్యాచులపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో జరగనున్న భారత్-న్యూజిలాండ్ మొదటి వన్డే మ్యాచ్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. బీసీసీఐ (BCCI) విడుదల చేసిన వీడియోలో వీరిద్దరూ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న దృశ్యాలు కనిపించాయి. విరాట్ కోహ్లీ తన స్టైలిష్ ఆఫ్-డ్రైవ్‌లతో అలరించగా, రోహిత్ శర్మ లెగ్-గ్లాన్స్, ఇతర షాట్లను ప్రాక్టీస్ చేశారు. బ్యాటింగ్‌తో పాటు వీరిద్దరూ ఫీల్డింగ్ డ్రిల్స్, క్యాచింగ్ ప్రాక్టీస్, రన్నింగ్‌లోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. "RoKo Reloaded" అనే క్యాప్షన్‌తో బీసీసీఐ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో విరాట్, రోహిత్‌లు తిరిగి జట్టులోకి వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విరాట్ కోహ్లీ, ఆపై విజయ్ హజారే ట్రోఫీలోనూ ఢిల్లీ తరఫున ఆడి తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. మరోవైపు, వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న రోహిత్ శర్మ కూడా ప్రోటీస్ సిరీస్. విజయ్ హజారే ట్రోఫీలో మంచి స్కోర్లు సాధించి జోరుమీదున్నాడు. 2027 వన్డే ప్రపంచ కప్ దృష్టిలో ఉంచుకుని, వీరిద్దరూ ఈ సిరీస్‌లోనూ తమ సత్తా చాటాలని భావిస్తున్నారు.

READ MORE .....

రోహిత్ ఎప్పటికీ నాకు కెప్టెనే : జై షా

Next Story