యువతిని బూటు కాలితో తన్నిన పోలీసు.. అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ నెటిజన్ల ఫైర్!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-21 10:25:29  IST  )

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో పోలీసు అధికారులు ఒక యువతిపై అత్యంత క్రూరంగా భౌతిక దాడికి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

యువతిని బూటు కాలితో తన్నిన పోలీసు.. అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ నెటిజన్ల ఫైర్!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఒక యువతిని రక్షించాల్సిన పోలీసులే అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తూ, బూటు కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలు మహిళా భద్రత, గౌరవం గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం 'వర్ది' ముసుగులో కొందరు అధికారులు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో చర్చ పెను ఉప్పెనలా మారింది. "ఇది అప్రకటిత అత్యవసర స్థితిని (Emergency) తలపిస్తోంది" అని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రక్షణ కల్పించవలసిన ఖాకీ చొక్కాకు ఇంతటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందని, ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ఇంతటి క్రూరత్వం ప్రదర్శించడం క్షమించరాని నేరమని వారు అభిప్రాయపడుతున్నారు. అధికార గర్వంతో సామాన్యులపై భౌతిక దాడులకు దిగడం నాగరిక సమాజానికి సిగ్గుచేటని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అలాగే వైరల్ వీడియో పై ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆ బాధ్యతారాహిత్య పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేసి, ఆ బూట్ల కింద నలిగిపోతున్న సామాన్యుడి ఆవేదనను పట్టించుకోకపోతే, రాబోయే రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని, బాధితురాలికి న్యాయం జరగాలని డిజిటల్ వేదికలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ వీడియోపై మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. స్థానిక ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు పలువురు ఏఐ ద్వారా తయారు చేసిన వీడియో అని, కావాలనే కొందరు దీనిని వైరల్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

Next Story