ఈ వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుతారు

by Dishanational1 |
ఈ వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుతారు
X

దిశ, వెబ్ డెస్క్: ఆకలి మనిషితో ఏమైనా చేయిస్తుందనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. పలు సందర్భాల్లో చూసి ఉంటాం. అయితే, ఓ చోట జరిగిన సంఘటనను చూస్తే మీకు ఆశ్చర్యం వేయకమానదు. ఓ వివాహ కార్యక్రమంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ వెరీ ఫన్నీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వివాహం కార్యక్రమం జరిగింది. అనంతరం చుట్టాలంతా భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో సడెన్ గా వర్షం వచ్చింది. దీంతో భోజనం చేస్తున్నవారంతా పక్కకు ఉరికారు. కానీ, కొందరు మాత్రం తడుస్తున్నా కూడా అక్కడే కూర్చొని తలపై కూర్చీలను అడ్డుగా పెట్టుకుని భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఫన్నీ ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.


Next Story

Most Viewed