VIRAL: కోఠి కాల్పుల ఘటనలో కీలక పరిణామం.. వెలుగులోకి వచ్చిన సీసీ టీవీ ఫుటేజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-31 05:02:30  IST  )

నగర నడిబొడ్డున ఎప్పుడూ రద్దీగా ఉండే కోఠి బ్యాంక్ స్ట్రీట్ ప్రాంతం ఇవాళ ఉదయం కాల్పులతో ఉలిక్కిపడింది.

VIRAL: కోఠి కాల్పుల ఘటనలో కీలక పరిణామం.. వెలుగులోకి వచ్చిన సీసీ టీవీ ఫుటేజ్
X

దిశ, వెబ్‌డెస్క్: నగర నడిబొడ్డున ఎప్పుడూ రద్దీగా ఉండే కోఠి (Koti) బ్యాంక్ స్ట్రీట్ ప్రాంతం ఇవాళ ఉదయం కాల్పులతో ఉలిక్కిపడింది. ఎస్‌బీఐ (SBI) ప్రధాన కార్యాలయం సమీపంలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఒక వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని, కాల్పులు జరిపి రూ. 6 లక్షలతో పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ (CCTV footage) ఇప్పుడు వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

ఆ వీడియోలో ఉదయం సుమారు 7 గంటల సమయంలో రిషద్ తన స్కూటీపై కోఠిలోని ఎస్‌బీఐ (SBI) మెయిన్ బ్రాంచ్ వద్ద ఉన్న ఏటీఎం (ATM) సెంటర్‌కు చేరుకున్నడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు, రిషద్ తన స్కూటీ దిగేలోపే అతడిని చుట్టుముట్టారు. తొలుత తుపాకీతో బెదిరించి నగదు బ్యాగును లాక్కోవడానికి ప్రయత్నించారు. అయితే రిషద్ వారిని గట్టిగా ప్రతిఘటించడంతో దుండగులు అతడి కాలిపై కాల్పులు జరిపారు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన రిషద్ వద్ద నుంచి రూ. 6 లక్షల నగదును లాక్కొని దుండగులు స్కూటీపై అక్కడి నుంచి వేగంగా చాదర్‌ఘట్ వైపు పారిపోవడం సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story