- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేత
శ్రీశైలంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలంలో VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. ప్రస్తుత వేసవి సెలవులు, వీకెండ్ సెలవుల కారణంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో, శనివారం నుండి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు గాను ఈ మూడు రోజుల పాటు భక్తులందరికీ కేవలం శ్రీ స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయం వల్ల ముందుగానే ఆన్‌లైన్ ద్వారా స్పర్శదర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారికి మాత్రం నిర్ణీత సమయాల్లో యధావిధిగా స్పర్శ దర్శనం కొనసాగుతుందని ఈవో వెల్లడించారు. కాబట్టి భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ అధికారులకు సహకరించవలసిందిగా కోరడమైనది.






