- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపం.. గ్రామస్తుల తీర్మాణం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు గ్రామస్థులు ఏకమయ్యారు.

దిశ, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు గ్రామస్థులు ఏకమయ్యారు. గ్రామపంచాయతీ తీసుకున్న తీర్మానానికి మద్దతుగా సోమవారం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకుని, తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపబోమని స్పష్టం చేశారు. విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను గ్రామంలోకి రానీయకుండా నిలిపివేసిన గ్రామస్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.
ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమైన కొందరు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్లి అక్కడే హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని గ్రామపంచాయతీ పాలకవర్గం పేర్కొంది. ప్రభుత్వ విద్యాభివృద్ధికి ప్రతి కుటుంబం సహకరించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. అబ్బాపూర్ గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ విద్య పరిరక్షణకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






